రేపు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌మేళా

Sep 11 2025 2:52 AM | Updated on Sep 11 2025 2:52 AM

రేపు

రేపు జాబ్‌మేళా

● చికున్‌ గున్యా, మలేరియా కేసులు కూడా లేవు ● డీఎంహెచ్‌ఓ కళావతిబాయి వెల్లడి

ఖమ్మం రాపర్తినగర్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 12న నగరంలోని టేకులపల్లి మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్‌ పోస్టులు 40, ట్రైనీ ఫార్మసిస్ట్‌ 20, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌ 30, రిటైల్‌ ట్రైనీ 10 పోస్టులకు ఇంటర్వ్యూలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిరాక్స్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

2,680 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

ఖమ్మం, భద్రాద్రి,

మహబూబాబాద్‌ జిల్లాలకు పంపిణీ

ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్‌ పాయింట్‌కు బుధవారం ఐపీఎల్‌ కంపెనీకి చెందిన 2,680 మెట్రిక్‌ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ ఎరువును ఖమ్మం జిల్లాకు 1,380, భద్రాద్రి జిల్లాకు 800, మహబూబాబాద్‌ జిల్లాకు 500 మెట్రిక్‌ టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయగా.. పోలీసు పహారాలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఖానాపురం

చెరువు పరిశీలన

ఖమ్మంఅర్బన్‌: నగరంలోని 3, 6 డివిజన్ల మధ్య ఉన్న ఖానాపురం చెరువును జలవనరుల శాఖ అధికారులు బుధవారం సందర్శించారు. చెరువులను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఏయే పనులు చేపట్టాలి, కట్టల పటిష్టత, పూడిక తీత, అలుగుల మరమ్మతులు తదితర అంశాలపై అంచనాలు రూపొదించనున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వెంట డీఈ ఉదమ్‌ప్రతాప్‌, రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకుడు మలీదు మనీష్‌ తదితరులు ఉన్నారు.

డెంగీ బాధితులు కోలుకున్నారు

నేలకొండపల్లి : జిల్లాలో డెంగీ కేసుల బాధితులంతా కోలుకున్నారని, ఎలాంటి ప్రమాదం లేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ డి.కళావతిబాయి అన్నారు. నేలకొండపల్లి పీహెచ్‌సీని, చెరువుమాధారం, పైనంపల్లి ఉప కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3.11లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించి, 7.45 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశామని తెలిపారు. ఇందులో 3,712 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. జిల్లాలో 155 డెంగీ కేసులు నమోదు కాగా.. వారంతా రికవరీ అయ్యారని తెలిపారు. చికున్‌ గున్యా, మలేరియా కేసులు లేవని చెప్పారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చెరువుమాధారానికి తరలించే విషయం ప్రస్తుతానికి లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌.ఆర్‌.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐల బదిలీ

ఖమ్మంక్రైం: జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీచేస్తూ సీపీ సునీల్‌దత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం టూటౌన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న సంధ్యను ఏన్కూరుకు, అక్కడ పనిచేస్తున్న ఉపతల రఫీని ఖమ్మం వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రేపు జాబ్‌మేళా1
1/3

రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా2
2/3

రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా3
3/3

రేపు జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement