
పోరాటస్ఫూర్తికి ప్రతీక.. ఐలమ్మ
ఖమ్మంమయూరిసెంటర్: పోరాట స్ఫూర్తికి ప్రతీకగా వీర వనిత చాకలి ఐలమ్మ నిలుస్తారని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీక అని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వీర వనితగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. అటువంటి వీరవనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘ సేవకురాలిగా, భూమి, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆమె ఆశయాలను నేటి తరం వారు కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారిణి జి. జ్యోతి, బీసీ సంఘం నాయకులు తుపాకుల ఎలగొండ స్వామి, నారాయణ, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, జక్కుల వెంకటరమణ, మిట్టపల్లి శంకర్, గోనెల శివప్రసాద్, గోనెల రవిశంకర్, దాసరి నాగేశ్వరరావు, కె. గోవిందరావు, కె. కొండల రావు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి