
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత
● ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ పాలన ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో గ్రామపంచా యతీ భవనాన్ని మంగళవారం ప్రారంభించిన మంత్రి.. కిష్టాపురం, జుజుల్‌రావుపేటల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన బూట్లు, సాక్సుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కాటమయ్య కిట్లు, క్రైస్తవ మహిళలకు కుట్టుమిషన్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
అన్ని హామీలు అమలుచేస్తాం
ఎన్నికల వేల ఇచ్చిన హామీలన్నీ అమలుచేసేలా ముందుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థిక భారం ఉన్నా దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఎన్నడూలేని విధంగా 7.5 లక్షల తెల్లరేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో పథకాలు మరింత జోరందుకోనున్నందున ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి కోరారు.
యూరియా పంపిణీలో సమస్యలు రావొద్దు
పాలేరు నియోజకవర్గంలో యూరియా పంపిణీలో సమస్యలు రాకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి యూరియా పంపిణీపై సమీక్షించిన ఆయన పీఏసీఎస్‌ల ద్వారా పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఈనెల 3నుంచి ఇప్పటి వరకు 610 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని అధికారులు చెప్పగా, భవిష్యత్‌లో ఇదే కొనసాగించాలని సూచించారు. కాగా, జీపీఓలుగా నియమితులైన పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు మంత్రిని కలిసి తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలి పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పేరు నిలబెట్టేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు నిజాయితీగా, చిత్తశుద్ధితో సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ నరసింహారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమాధికారి జ్యోతి, పాలేరు ప్రత్యేకాధికారి రమేష్, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్‌రావు, సీఐ సంజీవ్, ఏడీఏ సతీష్ తదితరులు పాల్గొన్నారు.