
లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
ఖమ్మంక్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. రాజీమార్గాన్ని రాజ మార్గంగా భావించాలని.. లోక్ అదాలత్‌లో ఇరువర్గాలు పరస్పర అంగీకారానికి వస్తే సత్వర పరిష్కారం పొందొచ్చని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసుల్లో కక్షిదారులు రాజీపడే అవకాశం ఉందని వెల్లడించారు. చిన్న కేసులతో సమయం, డబ్బు వృథా కావడమే తప్ప ఎలాంటి ఫలితం ఉండదని తెలిపారు. ఈమేరకు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో సీపీ విజ్ఞప్తి చేశారు. కాగా, పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాలు లోక్‌అదాలత్‌కు హాజరయ్యేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేశామని తెలిపారు.
గిరిజనులకు సంక్షేమ
పథకాలు చేరేలా అవగాహన
రఘునాథపాలెం: ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి సూచించారు. పథకంపై రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల పాటు ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం డీడీ మాట్లాడుతూ పూర్తిగా వెనుకబడిన గిరిజన గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను 2028 నాటికి చేరవేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాల లబ్ధిని గిరిజనులు అందుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపీడీఓ అశోక్‌కుమార్, ఏఓ నారాయణరెడ్డి, ట్రెయినర్లు బాలు, జ్యోతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో జలవనరుల శాఖ పరిధిలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా అంచనాల ప్రకారం కొనసాగించాలని క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ సీ.హెచ్.బుచ్చిరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలో మున్నేటి వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణం, సీతారామ ప్రాజెక్టు 14, 15వ ప్యాకేజీ పనులతో పాటు వైరా రిజర్వాయర్ పరిధిలోని పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసిన సీఈ అవసరమైన మార్పులపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఈఈ రమణ, డీఈ చంద్రమోహన్, జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ బాబురావు, డీఈ ఉదయప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి