
ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్
ఖమ్మం సహకారనగర్: ప్రజా చైతన్యమే లక్ష్యంగా మహాకవి కాళోజీ నారాయణరావు రచనలు చేశారని, సాహితీవేత్తగా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ అని, తెలంగాణ వైతాళికుడిగా నిలిచారని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.