
రావోజీతండా వాసికి డాక్టరేట్
కారేపల్లి: కారేపల్లి మండలం రావోజీ తండా గ్రామానికి చెందిన గుగులోతు నెహ్రూ ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి బాపట్ల వ్యవసాయ కళాశాలలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. వేరుశనగ సాగులో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, నెహ్రూ తల్లిదండ్రులు రాందాస్, భద్రి వ్యవసాయం చేస్తుండగా.. రైతుల కుటుంబాలకు మేలు జరిగేలా మరిన్ని పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
జాబ్ మేళాలో
15 మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు 56 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 15మంది ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ జాబ్‌మేళాను పర్యవేక్షించారు.
అప్రమత్తతోనే
సీజనల్ వ్యాధులు దూరం
బోనకల్: ప్రజలు ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యా ధులు దరిచేరవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా ధికారి కళావతిబాయి తెలిపారు. మండలంలోని ముష్టికుంట్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఇటీవల వర్షాలతో ఉపకేంద్రంలో నీరు నిలిచిందని, గ్రామంలోనూ డ్రెయినేజీలు లేక రోడ్లపై మురుగు నీటి ప్రవాహంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని ఉద్యోగులు చెప్పారు. ఈమేరకు ఫ్రై డే – డ్రై డే, శానిటేషన్ పనులపై పంచాయతీ కార్యదర్శి సైదులుకు డీఎంహెచ్‌ఓ సూచనలు చేశారు. అంతేకాక దోమల నివారణ, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డీపీఓ ఎం.దుర్గ, వైద్యాధికారులు స్రవంతి, ప్రియాంక, ఉద్యోగులు పాల్గొన్నారు.

రావోజీతండా వాసికి డాక్టరేట్