
ఓపీ వద్ద భారీ క్యూలైన్
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిటకిటలాడింది. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో సోమవారం వివిధ ప్రాంతాల ప్రజలు ఉదయం 8గంటల నుంచే క్యూ కట్టారు. దీంతో ఓపీ వద్ద భారీ క్యూలైన్ ఏర్పడగా చీటీ తీసుకునేందుకు గంటల సమయం పట్టింది. అలాగే, పలు విభాగాలు మధ్యాహ్నం వరకు కిక్కిరిసి కనిపించాయి. ఈక్రమాన కూర్చునే స్థలం లేక వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల వర్షాలతో నీరు నిలిచి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా చుట్టు పక్కల జిల్లాల జనం సైతం జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. సోమవారం ఒకేరోజు పెద్దాస్పత్రిలో 2,200 – 2,400 మంది వైద్య సేవలు పొందారని అధికారులు తెలిపారు.
– ఖమ్మం వైద్యవిభాగం