
2,250 ఎకరాల్లో బొప్పాయి సాగు
కామేపల్లి: ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 2,250 ఎకరాల్లో బొప్పాయి పంట సాగవుతోందని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్ తెలిపారు. వైరా డివిజన్ ఉద్యాన అధికారి ఆకుల వేణుతో కలిసి ఆయన సోమవారం మండలంలో పర్యటించారు. తాళ్లగూడెం తదితర గ్రామాల్లో సాగవుతున్న బొప్పాయి పంటను పరిశీలించి చీడపీడల నివారణపై సూచనలు చేశారు.
బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా వాసుదేవరావు
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ రాష్ట్ర నూతన కమిటీని సోమవారం ప్రకటించగా ఖమ్మంకు చెందిన నాయకుడు దేవకి వాసుదేవరావుకు స్థానం దక్కింది. ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు వాసుదేవరావును అభినందించారు.