తెలంగాణ తెలుగు.. వెలుగు! | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ తెలుగు.. వెలుగు!

Sep 9 2025 8:41 AM | Updated on Sep 9 2025 8:41 AM

తెలంగ

తెలంగాణ తెలుగు.. వెలుగు!

● ప్రత్యేక రాష్ట్రంలో భాషకు ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా సమ్మిళిత మాండలికం

యాసలు కలిసిన భాష తెలుగు

భాషా సౌరభం వ్యాప్తి

● ప్రత్యేక రాష్ట్రంలో భాషకు ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా సమ్మిళిత మాండలికం
నేడు తెలంగాణా భాషా దినోత్సవం

ఖమ్మంగాంధీచౌక్‌: భాషా చైతన్యాన్ని ప్రోత్సహించడం, పెంపొందించడమే లక్ష్యంగా ప్రాంతాలు, ప్రాంతీయత వారీగా భాషా దినోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి ఏటా తెలంగాణ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 9న నిర్వహిస్తున్నారు. ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఈ తేదీని ఖరారు చేశారు. ఈమేరకు నేడు(మంగళవారం) తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కథనం.

అంతులేని ప్రేమ

‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరింనోడే నాకు ఆరాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అందుకే ఆయనను తెలంగాణ తొలిపొద్దుగా కీర్తిస్తారు. తెలంగాణ భాషపై అంతులేని ప్రేమ కనబరిచిన ఆయన పండితుల భాషలో కాకుండా సామాన్యుల భాషలోనే రచనలు చేశారు. ఫలితంగా జనం గోడుకు ఆయన కలం గొంతుకగా మారింది.

మాండలికాలు వేరు

తెలుగు భాష ఒక్కటే అయినా మాండలికాలు అనేకం ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ భాషలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. నిజాం పాలనలో ఉర్దూ కలగలిసిన తెలంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేసేవారు. దీన్ని తెలంగాణ సాహితీవేత్తలు తీవ్రంగా విమర్శించగా.. అందులో అగ్రభాగాన కాళోజీ నిలిచారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన తెలుగు భాష, తెలంగాణ యాసపై తనదైన ముద్ర వేశారు. కాగా, తెలుగు భాషలో తెలంగాణ యాస ప్రత్యేకంగా నిలుస్తుండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ యాసకు ఉన్న ప్రత్యేక శైలితో ప్రాచుర్యం పొందింది. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ప్రజలను మేల్కొల్పింది, కదన రంగంలోకి దూకించింది తెలంగాణ భాషే అన్నది సుస్పష్టం. ఇక సినిమాల్లోనూ ఈ యాసకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. పలువురు నటులు ఈ యాసలో డైలాగ్‌లతో సినిమాలను రక్తి కట్టించారు.

ఇక్కడ రెండు యాసలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగు భాష, యాస సమ్మిళితంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో రాకపోకలు పెరగడంతో ప్రజల మాటల్లో యాస కలగలిపి కనిపిస్తుంది. ఇదే సమయాన సింగరేణి, తదితర పరిశ్రమల్లో పనిచేసేందుకు ఉత్తర తెలంగాణ వేలాది మంది వచ్చి ఇక్కడ స్థిరపడడంతో తెలంగాణ యాసకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు.

తెలుగు భాషలో అనేక యాసలు ఉన్నాయి. ఇందులో తెలంగాణ యాసకు ప్రత్యేకత ఉంది. జిల్లా కవి చందాల కేశవదాసు సినిమా పాటల కవిగా నిలిచా రు. హీరాలాల్‌, దాశరథి సోదరులు, కౌముది, షో యబుల్లాఖాన్‌. ఎందరో భాషాభ్యున్నతికి కృషి చేశారు.– పొన్నెకంటి స్వప్న, తెలుగు అధ్యాపకురాలు

తెలంగాణ భాషా సౌరభం ఉమ్మడి జిల్లాలో వ్యాప్తి చెందింది. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ యాస, మాండలికంలో పుస్తకాలు వచ్చాయి. పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రధానంగా కాళోజీ రచనలు ఆదర్శప్రాయం. – సయ్యద్‌ షఫీ, తెలుగు ఉపాధ్యాయుడు

తెలంగాణ తెలుగు.. వెలుగు!1
1/2

తెలంగాణ తెలుగు.. వెలుగు!

తెలంగాణ తెలుగు.. వెలుగు!2
2/2

తెలంగాణ తెలుగు.. వెలుగు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement