బోనకల్: బోనకల్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన 70 కుటుంబాలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సమక్షాన కాంగ్రెస్‌లో చేరాయి. హై దరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం వీరికి భట్టి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువు రు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్, సొసైటీ అధ్యక్షు డు చావా వెంకటేశ్వరావుతో పాటు పోటు వెంకటేశ్వర్లు, మందా హైమావతి, మోర్ల మహేశ్వరావు, మంద రమణ, టేకులపల్లి సాంబయ్య, మరీదు నరసింహారావు తదితరులు ఉండగా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరావు, నా యకులు బందం శ్రీను, పైడిపల్లి కిశోర్, గాలి దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరావు, సుబ్బారావు, భద్రూనాయక్ పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నియామకాలకు ఈనెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్సనశాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు 18–45 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులని వెల్లడించారు. అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో ఖమ్మం గాంధీచౌక్‌లోని రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
నేడు వాహనాల వేలం
ఖమ్మంక్రైం: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఖమ్మంలోని ఎకై ్సజ్ స్టేషన్–1 ఆవరణలో ఉదయం 11గంటలకు వేలం మొదలవుతుందని, ఆసక్తి ఉన్న వారు ధరావత్తు రుసుము చెల్లించి పాల్గొనాలని సూచించారు. వాహనం దక్కించుకుంటే మొత్తం సొమ్మును జీఎస్‌టీతో సహా వెంటనే చెల్లించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో ధరావత్తు జప్తు చేస్తామని తెలిపారు.
వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో సత్తా
ఖమ్మం స్పోర్ట్స్/ఖమ్మంఅర్బన్: ఖేలో ఇండి యా లీగ్ పోటీల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో జరి గిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఖమ్మంకు చెందిన ఎ.టోనిశ్రీ ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం దక్కించుకుంది. మహిళల 53 కేజీల కేటగిరీలో పాల్గొన్న ఆమె స్నాచ్‌లో 53, క్లీన్ అండ్ జర్క్‌లో 65 కేజీలు కలిపి 118 కేజీల బరువు ఎత్తడంతో ప్రథమస్థానంలో నిలి చింది. ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న టోనిశ్రీని వెయిట్ లిప్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివగణేష్, డి.వినోద్‌కుమార్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణతో పాటు బాజిని వీరయ్య, తిరుపతిరావు, వినోద్‌కుమార్, నాగరాజు, సిద్ధార్థ, ప్రశాంత్, విప్లవ్, ఉదయ్, సుమతి తదితరులు అభినందించారు.
పట్టు పురుగుల పెంపకం పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: వైరా మండలం గొల్లపూ డి, రెబ్బవరం గ్రామాల 30 మంది రైతులు విజ్ఞా న యాత్రలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో పలువురు రైతుల పట్టు పురుగుల కేంద్రాలను పరిశీలించారు. రేరింగ్ షెడ్, మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ ఉప సంచాలకులు ముత్యాలు, అధికారులు, రైతులు కామేశ్వరరావు, దేవరాజు, ఎం.లాల్, రవీందర్, రమేష్, శంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం సమక్షాన కాంగ్రెస్‌లో చేరిక