
తీరని యూరియా కష్టాలు
నేలకొండపల్లి/బోనకల్/కూసుమంచి: రోజులు గడుస్తున్నా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తీరడం లేదు. నేలకొండపల్లి రైతు వేదిక వద్ద సోమవారం సొసైటీ ఆధ్వర్యాన యూరియా పంపిణీ చేయడంతో రైతులు భారీగా వచ్చారు. పట్టాదారు పాసు పుస్తకాలు జిరాక్స్‌లను క్యూలో పెట్టగా.. ఏఓ ఎం.రాధ కూపన్లు జారీ మొదలుపెట్టారు. ఇంతలోనే తోపులాట జరగడంతో మహిళా రైతు కె.మల్లమ్మకు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆపై గ్రామాల వారీగా కౌంటర్లు ఏర్పాటుచేసి, స్టాక్ ఉన్న యూరియాకు తోడు త్వరలో వచ్చే స్టాక్‌కు కూడా కూపన్లు జారీ చేశారు. ఇక బోనకల్ మండలం మోటమర్రి పీఏసీఎస్‌లో 230 బస్తాల యూరియా రాగా, 400 మంది రైతులు కేంద్రం తెరవక ముందే చేరుకున్నారు. దీంతో ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇచ్చినా చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. కాగా, కూసుమంచి మండలంలోని కల్లూరుగూడెం, చేగొమ్మ, జక్కేపల్లి పీఏసీఎస్‌లతో పాటు 14 సబ్‌సెంటర్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఒక్కో సెంటర్‌కు 110 బస్తాలే కేటాయించడంతో పెద్దసంఖ్యలో రైతులు చేరుకోగా పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా పోలీసు బందోబస్తు నడుమ కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ చేశారు. ఈక్రమాన తోపులాట జరిగింది. తహసీల్దార్ రవికుమార్, ఏడీఏ సతీష్, ఎంపీడీఓ రాంచందర్‌రావు, ఏఓ వాణి తదితరులు పర్యవేక్షించారు.

తీరని యూరియా కష్టాలు

తీరని యూరియా కష్టాలు