
రైతులు ఇబ్బంది పడొద్దని అదనపు కౌంటర్లు
కామేపల్లి: రైతులు యూరియా కోసం ఇబ్బంది పడకుండా రైతు వేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. కామేపల్లి మండలం పొన్నేకల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సేల్ కౌంటర్లను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అయితే, రైతులు పరిమితి మేరకే యూ రియాను దఫాదఫాలుగా వాడాలని సూచించారు. ఇదే సమయాన నానో యూరియా, నానో డీఏపీపై లాభాలను గ్రహించాలని తెలిపారు. అలాగే, కొండాయిగూడెం సొసైటీలో యూ రియా పంపిణీని ఏడీఏ కొంగర వెంకటేశ్వరరా వు పరిశీలించారు. కొండాయిగూడెం పీఏసీఎస్ చైర్మన్ ధనియాకుల హన్మంతరావు, సీఈఓ దొడ్డా ముత్తయ్య, ఏఓ తారాదేవి, ఏఈఓలు ఉష, శ్రీకన్య, దీపక్‌రెడ్డి, జగదీశ్వర్, భాస్కర్, రవికుమార్, గాదె నాగయ్య పాల్గొన్నారు.