వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Sep 8 2025 4:52 AM | Updated on Sep 8 2025 4:52 AM

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

ఖమ్మంరూరల్‌: ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన జలగం నర్సయ్య (48) గత నెల 28న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఇంట్లో గొడవ పెట్టుకుని, ఖమ్మం వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఇతను నీలం రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

సత్తుపల్లిరూరల్‌: కలుపుమందు సేవించి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సిద్ధారంలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్ధారానికి చెందిన మోరంపూడి మాధవరావు (68) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా డు. శనివారం రాత్రి ఇంట్లో ఉన్న కలుపుమందు తాగగా కుటుంబ సభ్యు లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య సరోజిని, కుమార్తె సత్యవాణి ఉన్నారు. ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

ఖమ్మంఅర్బన్‌: నగరంలోని ఇల్లెందు రోడ్డులో ఎన్నెస్పీ కాల్వ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన కేలోతు రవి, ఆయన భార్య కమల ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ ఢీకొంది. ఈ ఘటనలో రవి గాయపడి చికిత్స పొందుతున్నాడు. కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

ముగ్గురిపై కేసు నమోదు

ఖమ్మంఅర్బన్‌: నిమజ్జన వేడుకల విధుల్లో ఉన్న ఇద్దరు ఎస్‌ఐలను మద్యం మత్తులో ముగ్గురు యువకులు నెట్టివేసిన ఘటన శనివారం రాత్రి ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. దీంతో ఆ ముగ్గురు యువకులపై ఆదివారం ఖమ్మంఅర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖానాపురం యూపీహెచ్‌ కాలనీకి చెందిన కొందరు యువకులు గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరారు. రాత్రి 11.30 గంటల సమయంలో భారీ డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. విధుల్లో ఉన్న ఖమ్మంఅర్బన్‌ (ఖానాపురంహవేలి) ఎస్‌ఐ మధుకుమార్‌ అక్కడికి చేరుకుని డీజే వాహనాన్ని పంపించగా, నిమజ్జన వాహనాన్ని తరలించాలని చెప్పినప్పటికీ వినకుండా మద్యం మత్తులో ఉన్న మహేశ్‌, మాధవరావు, బాలు ఆయనను నెట్టివేశారు. అక్కడికి చేరుకున్న మరో ఎస్‌ఐ శ్రావణ్‌తో కూడా అదే రీతిలో ప్రవర్తించారు. వెంటనే ఎస్‌ఐలు ఉన్నతాధికారులకు సమాచారం అందించి, విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు.

14 నుంచి సింగరేణి

ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ సేవలు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌ కార్పొరేట్‌ వైద్యులు సింగరేణి ఆస్పత్రులను సందర్శించనున్నారని సింగరేణి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌రాజ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న కొత్తగూడెంలోని ఆస్పత్రికి కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు రానున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement