
బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
బోనకల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సబ్ జూనియర్, జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా జట్లను ఆదివారం ఎంపిక చేశారు. మొత్తం 80 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా కోచ్ అమిరేశి లింగయ్య, జిల్లా అసోషియేషన్ కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు, అధ్యక్షులు వి.సురేశ్‌కుమార్ క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై నవారు ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే 44వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ పోటీల్లో ఆడనున్నారు. పోటీలు జనగాం జిల్లాలో జరుగుతాయని తెలిపారు.
ఎంపికై న క్రీడాకారులు సబ్ జూనియర్ బాలుర విభాగంలో జి.సురేశ్, బి.హర్షవర్ధన్, రెహమాన్, కె.వినయ్, మునీరుద్దీన్, ఎస్‌కే యాకూబ్‌పాషా, ఎస్‌కే నజీరుద్దీన్, ఎండీ ఆదాన్‌షమీ ఉన్నారు.
సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఎన్.మనీషా, కె.నవ్య, కె.ఆకాంక్ష, ఆర్.సాహితి, కె.అక్షయ, డి.రాజేశ్వరి, ఎస్.మోక్షిత, సీహెచ్ సంగీత, టి.యశ్వంతి, కె.రిషిత, కె.అక్షయ్ ఉన్నారు.
జూనియర్ బాలుర జట్టుకు జి.గోపి, యాసర్, ఆదిల్, జ్యోషి, జి.గణేశ్, జయదీప్ మనాస్, సురేశ్, తనుష్, శ్రీహరి, ఎం.రఘురామ్, ఎం.శరణ్, జానకీరామ్ ఎంపికయ్యారు.
జూనియర్ బాలికల జట్టుకు జశ్వంతి, ఎ.రష్మీ, కె.మధులత, యూహిత, ఎన్.మనీషా, కె.నవ్య, కె.ఆకాంక్ష, ఆర్.సాహితి, కె.అక్షయ్, వి.రాజేశ్వరి, పి.ఉమామహేశ్వరి, భూలక్ష్మీ తదితరులు ఎంపికయ్యారు.