
బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం..
ఖమ్మవైరారోడ్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ రాజకీయం చేస్తూ బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తలాపున గోదావరి పారుతున్నప్పటికీ తాగడానికి నీళ్లు లేని దుస్థితి ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నీటి సమస్య తీరిందన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 281 టీఎంసీల నీటి లభ్యత ఉండటం వల్ల మేడిగడ్డకు ప్రాజెక్ట్‌ను తరలించారన్నారు. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే కుంగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే మోటార్లు ప్రారంభించి నీటిని ఎత్తిపోయవచ్చని, గతంలో లాగే ఇప్పుడు కూడా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లలో అన్ని గేట్లు ఎత్తేసి అన్ని పంపులను పడావు పడేలా చేశారని తెలిపారు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మిస్తే, కేసీఆర్ గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. సమావేశంలో పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల్‌రావు, డోకుపర్తి సుబ్బారావు, మందడపు శంకర్‌రావు, పగడాల నరేందర్, కొండల్‌రావు, మురళీకృష్ణ, రఫీ, గోపి, రాజేశ్, అశోక్‌సింగ్, షారుక్ అరాఫత్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి