
మావోయిస్ట్ ఆయుధ తయారీ కేంద్రం గుర్తింపు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఆదివారం భద్రతా బలగా లు గుర్తించా యి. వివరాలిలా ఉన్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుంజపర్తి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన గుంజపర్తి క్యాంపునకు చెందిన భద్రతా బలగాలు సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబధించిన ఆయు దాల తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. ఈ కేంద్రంలో లేత్ మిషిన్, జనరేటర్, వాటర్ పంప్, ఎలక్ట్రిక్ కట్టర్, హైడ్రాలిక్ సిలిండర్, మోటారు విడి భాగాలు, స్టీల్ ప్లేట్లు, ఆయుధాల తయారీకి ఉపయోగించే విడి సామగ్రితో పాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అక్కడే ధ్వంసం చేశారు.