ఆర్థిక లావాదేవీల్లో వివాదం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక లావాదేవీల్లో వివాదం

Sep 7 2025 7:50 AM | Updated on Sep 7 2025 7:50 AM

ఆర్థి

ఆర్థిక లావాదేవీల్లో వివాదం

ఇల్లెందు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌

బావమరిది ఆత్మహత్య

పంచాయితీలో వేధించారని

డీవీపై ఫిర్యాదు

ఇల్లెందు/కారేపల్లి: ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన విబేధాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మృతుడు, ప్రముఖ కాంట్రాక్టర్‌ గడిపర్తి శ్రీనివాసరావు(53).. ఇల్లెందు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)కు వరుసకు బావమరిది కావడం, ఘటనకు డీవీనే కారణమంటూ ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందు కాకతీయనగర్‌కు చెందిన గడపర్తి శ్రీనివాసరావు – డీవీ కలిసి కొన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, కాంట్రాక్టు పనులు చేస్తుండగా ఏడాది నుంచి వివాదం మొదలైంది. డీవీ తనకు రూ.కోటిన్నర ఇవ్వాలని శ్రీనివాసరావు చెప్పినట్లు తెలుస్తుండగా, ఇదే విషయమై ఖమ్మంలో శుక్రవారం పెద్దల సమక్షాన పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. అక్కడ ఆయనను కొందరు దూషించినట్లు సమాచారం. అంతేకాక డీవీ అనుచరుడు దమ్మాలపాటి ప్రసాద్‌, ఆయన కుటుంబీకులు శ్రీనివాసరావు, ఆయన భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడడంతోపాటు బాకీ రూ.కోటిన్నరలో రూ.49లక్షలే ఇవ్వాలని నిర్ణయించినట్లు పలువురితో ఫోన్‌లో చెప్పుకుని వాపోయినట్లు తెలిసింది. ఆతర్వాత ఏం జరిగిందో కానీ కారులో ఇల్లెందు బయలుదేరిన శ్రీనివాసరావుకు రమ రాత్రి 10 గంటల తర్వాత ఫోన్‌ చేయగా కారేపల్లి క్రాస్‌ రోడ్‌కు వచ్చినట్లు చెప్పిన ఆయన ఆతర్వాత ఇంటికి చేరకపోగా ఫోన్‌ కూడా తీయలేదు. ఈక్రమంలోనే కుటుంబీకులు వెతుకుతుండగా కారేపల్లి – ఇల్లెందు మండలాల సరిహద్దు మొట్లగూడెంలోని ఆయన తోట వద్ద కారును గుర్తించారు. అందులో పరిశీలించగా కూర్చున్న స్థితిలోనే మృతి చెంది ఉండడం, పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్మ చేసుకున్నట్లు గుర్తించారు.

డీవీ ఇంటి ఎదుట ఆందోళన

శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించగానే కారేపల్లి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఇల్లెందు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఘటనకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావే కారణమంటూ మృతదేహాన్ని ఇల్లెందులోని ఆయన నివాసం వద్దకు తరలించారు. డీవీ ఇంటి ఆవరణలో మృతదేహాన్ని పెట్టి ఆందోళన ఆందోళన నిర్వహించారు. డీవీ వాహనం, ఫర్నీచర్‌ను సైతం ధ్వంసం చేయగా ఇల్లెందు సీఐ సురేష్‌, కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి, సిబ్బంది అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసరావు ఆత్మహత్యకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కుటుంబసభ్యులు, దమ్మాలపాటి ప్రసాదే కారణమంటూ మృతుడి భార్య రమ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలో పంచాయితీలో ఉందని సమీప బంధువులు పాకాలపాటి చంద్రయ్య, భారతీరాణి తదితరులతో వెళ్లిన శ్రీనివాసరావు మృతదేహంగా రావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.గోపి తెలిపారు. కాగా, ఇల్లెందు ఆస్పత్రిలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. అయితే, ఖమ్మంలో శుక్రవారం రోజంతా నగదు విషయమై పంచాయితీ జరిగిందని సమాచారం. ఈక్రమాన తనకు రావాల్సిన రూ.1.50కోట్లకు బదులు రూ.49లక్షలే ఇస్తామనడం, పలువురు దూషించడంతోనే శ్రీనివాసరావుఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

డీవీ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

ఇల్లెందు: సుమారు 50 మందితో ఇంటికి మీదకు వచ్చి దాడి చేసినవారిపై, అందుకు ప్రోత్సహించిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు భార్య బేబి భార్గవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి, జానీపాష ప్రోద్బలంతో మీర్జంబేగ్‌, గడపర్తి వెంకటేశ్వర్లు, దుద్దుకూరి రోశమ్మ, శృతి, చింతనిప్పు కృష్ణారావు, చింతనిప్పు రాంబాబుతో మరికొందరు తమ ఇంటికి వచ్చి అద్దాలు, తలుపులు ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆర్థిక లావాదేవీల్లో వివాదం1
1/1

ఆర్థిక లావాదేవీల్లో వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement