
●నగరంలో..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7, 9, 10వ డివిజన్ల జంక్షన్‌గా ఉన్న ఇందిరానగర్ –టేకులపల్లి మధ్య ప్రధాన రహదారి ఆనుకొని ఓ వైపు దేవాలయం, మరో వైపు టేకులపల్లి వంతెన, దాని పక్కనే సాగర్ ప్రధాన కాల్వ ఉంటాయి. రోడ్డు వెడల్పుగా లేకపోవడం, కీలక జంక్షన్ కావడంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. కాల్వ వైపు ఫెన్సింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసినా, రక్షణ గోడ లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. అలాగే, రఘునాథ పాలెంమండలంలోని వీ.వీ.పాలెం–చింతగుర్తి రహదారిపై సాగ ర్ కాల్వపై నిర్మించిన పాత వంతెన కూడా శిథిలావస్థలో ఉంది.