
లడ్డూలకు భారీ వేలం..
సత్తుపల్లి: స్థానిక జేవీఆర్ పార్కు ఎదురుగా శ్రీ ప్రసన్నగణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన మహాగణపతి చేతిలోని లడ్డూను శనివారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన మందపాటి కేశవరెడ్డి రూ.4.05 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. నిర్వాహకులు కూసంపూడి శ్రీనివాసరావు, గుడిపూడి గాంధీ, దారా ఏకాదశమూర్తి, నాయుడు వెంకటేశ్వరరావు, రాజు పాల్గొన్నారు.
అంచనాపురంలో
రూ.1.61 లక్షలు
కొణిజర్ల: మండలంలోని అంజనాపురం (కొత్తూరు)లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాట నిర్వహించారు. రూ.1,61,916తో కన్నేటి గోపాల్‌రావు, నాగేశ్వరరావు కలిసి దక్కించుకున్నారు.
మధిరలో రూ.73వేలు
మధిర: మధిరలోని రైల్వే గేట్ సెంటర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని శనివారం నిమజ్జనం చేశారు. వేలాదిగా భక్తులు పాల్గొనగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ఈ సందర్భంగా లడ్డూను రూ.73వేలకు రమేష్‌రెడ్డి దక్కించుకున్నారు.

లడ్డూలకు భారీ వేలం..