
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య
కూసుమంచి: మండలంలోని చౌటపల్లికి చెందిన నూకల సాయి కుమార్ (23)ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆయన శుక్రవారం పురుగులమందు తాగగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆర్థికసమస్యల కారణంగానే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి మల్లయ్య ఇచ్చి న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమ విఫలమైన యువకుడు..
కూసుమంచి: మండలంలోని మునిగేపల్లికి చెందిన తుపాకుల సిద్ధూ (25) శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కొన్నాళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తుండగా, ఆమె నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సిద్ధూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తండ్రి హుస్సేన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
కుక్కల దాడిలో
లేగదూడ మృతి
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారంలో కుక్కలుదాడి చేయగా లేగ దూడ మృతి చెందింది.గ్రామానికి చెంది న రైతు తెల్లగొర్ల అనిల్ అప్పుడే పుట్టిన లేగదూడను శనివారం పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. ఈక్రమాన కుక్కల గంపు దాడిచేసి దూడనుఈడ్చుకెళ్లి దాడి చేయడంతో చనిపోయింది. మరికొన్ని పశువుల వెంట పడడంతో స్థానికులు స్పందించగా కుక్కలు పారిపోయాయి.