
●కొణిజర్లలో..
కొణిజర్ల: కొణిజర్ల – తనికెళ్ల బోడియాతండా మధ్య ప్రవహిస్తున్న ఎన్నెస్పీ ప్ర ధాన కాల్వపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. బ్రిడ్జికి రెండువైపులా రెయిలింగ్ ధ్వం సం కావడం.. ఈ మా ర్గంలో వందలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడు ఏం జరుగుతుందో భయ పడుతున్నారు. సరిగ్గా బ్రిడ్జి వద్దే మూలమలుపు ఉండడం.. అక్కడకు వచ్చే వరకు బ్రిడ్జి ఉన్న ట్లు తెలియకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఏడాది క్రితం వైరాకు చెందిన ఇద్దరు ట్రా క్టర్ డ్రైవర్లు ట్రాక్టర్‌తో కాల్వలో పడి మృతి చెందినా.. అధికారులు కనీస మరమ్మతులు చేయించలేదు.