
సీఎం చేతుల మీదుగా అవార్డులు
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేలా విద్యార్థులు వచ్చివెళ్లేందుకు సొంత ఖర్చులతో ఆటో సమకూర్చడమే కాక ట్యూటర్ నియమించిన నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జ్ ఎంఈఓ బి.చలపతిరావు సేవలకు గుర్తింపు లభించింది. ఆయన కృషిపై ‘బడి బలోపేతానికి బాధ్యతగా..’ శీర్షికన జూలై 6న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయనను సన్మానించారు. ఈకార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తదితరులు పాల్గొన్నారు.
●కల్లూరు: కల్లూరు మండలం చెన్నూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాగా హైదరాబాద్‌లో అవార్డు అందుకున్నారు.
●మధిర : మధిర మండలం దెందుకూరుకు పగిడిపల్లి నాగచందర్‌రావు మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు స్వీకరించారు.
జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులకు
అవకాశం

సీఎం చేతుల మీదుగా అవార్డులు

సీఎం చేతుల మీదుగా అవార్డులు