
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలో సమగ్ర క్రీడాభివృద్ధి సాధించేలా పీడీలు, పీఈటీ, కోచ్‌లు శ్రమించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన పీఈటీలు, పీడీలు, కోచ్‌లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో కేవలం చదువుపైనే దృష్టి పెట్టడంతో విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారని తెలిపారు. శారీరక సామర్ధ్యం, ఏకాగ్రత పెరిగేలా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి 150 నిమిషాలు శిక్షణ తప్పనిసరి చెప్పారు. ఈ విషయమై రికార్డులు కూడా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే క్రీడా కిట్లు పంపిణీ చేసినందున మైదానాలను చదువును చేయించి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అలాగే, క్లస్టర్, మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలని, నైపుణ్యం కనబరిచే వారికి స్టేడియాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపాలని సూచించారు. పాఠశాలల్లో తరగతుల వారీగా క్రీడా శిక్షణకు టైంటేబుల్ రూపొందించి, స్పోర్ట్స్ కమిటీలను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలోడీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి