నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Sep 6 2025 5:33 AM | Updated on Sep 6 2025 5:33 AM

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

శోభాయాత్ర మార్గాలు (ప్రకాశ్‌నగర్‌ / బొక్కలగడ్డ ఘాట్లకు) తిరుగు ప్రయాణం రాకపోకలు నిషేధం

జిల్లా కేంద్రంలో

నేడు గణేష్‌ శోభాయాత్ర

ఖమ్మంలో ట్రాఫిక్‌ ఆంక్షలు,

రూట్‌మ్యాప్‌ ఖరారు

ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించిన గణేష్‌ విగ్రహాలను శనివారం నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం మున్నేటికి ఇరువైపులా పలు చోట్ల ఘాట్లు ఏర్పాటుచేశారు. ఈనేపథ్యాన శోభాయాత్ర, నిమజ్జనం సాఫీగాసాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. అంతేకాక నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని, గణేష్‌ శోభాయాత్ర నిర్దేశిత రూట్‌మ్యాప్‌ ప్రకారమే జరిగేలా చూడాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య విద్యుత్‌ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, నిమజ్జనం సకాలంలో జరిగేలా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకోవాలని తెలిపారు. అలాగే, శోభాయాత్రలో సౌండ్‌ సిస్టమ్‌, డీజేలపై నిషేధం ఉంటుందని, డ్రైవర్లు మద్యం, మత్తు పానీయాలు సేవించొద్దని సూచించారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అడిషనల్‌ డీసీపీ ప్రసాద్‌రావు ఆధ్వర్యాన 500 మంది పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని సీపీ తెలిపారు.

●మామిళ్లగూడెం ఏరియా విగ్రహాలను మయూరి సెంటర్‌, కిన్నెర, జెడ్పీ సెంటర్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా చేర్చాలి.

●ఆర్టీసీ కార్యాలయం, బ్యాంక్‌ కాలనీ ప్రాంత గణేష్‌ విగ్రహాల ఊరేగింపు ఎన్‌టీఆర్‌ సర్కిల్‌, ఇల్లెందు క్రాస్‌, జెడ్పీ సెంటర్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా చేరుకోవాలి.

●రోటరీనగర్‌, ఇందిరానగర్‌ ప్రాంతం గణేష్‌ విగ్రహాల ఊరేగింపు మమత క్రాస్‌, ఇల్లెందు క్రాస్‌, జెడ్పీ సెంటర్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా వెళ్లాలి.

●కస్బాబజార్‌, కమాన్‌బజార్‌ విగ్రహాల ఊరేగింపును చర్చి కాంపౌండ్‌ మీదుగా కొనసాగించాలి.

●గొల్లగూడెం, శ్రీనగర్‌ కాలనీ ప్రాంతాల విగ్రహాలను లకారం ట్యాంక్‌ బండ్‌ నుంచి, టాటా మోటార్స్‌, చెరువుబజార్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా తీసుకెళ్లాలి.

●శ్రీరామ్‌హిల్స్‌, ముస్తఫానగర్‌ ప్రాంత విగ్రహాలను ముస్తఫానగర్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

●వైరా రోడ్డు ప్రాంతంలోని గణేష్‌ విగ్రహాల ఊరేగింపు జెడ్పీ సెంటర్‌, చెరువు బజార్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా కొనసాగించాలి.

●సారధినగర్‌ ప్రాంత విగ్రహాలను గాంధీచౌక్‌, నాయుడు సిల్క్స్‌, పీఎస్‌ఆర్‌ రోడ్‌, గుంటు మల్లన్న ఆలయం, ట్రంక్‌ రోడ్‌, నయాబజార్‌ మీదుగా తీసుకెళ్లాలి.

రూరల్‌ మండలం..

●నాయుడుపేట, జలగంనగర్‌, పెద్ద తండా, సాయిప్రభాతనగర్‌, సాయి గణేష్‌ నగర్‌, సూర్య నగర్‌, కరుణగిరి, రాజీవ్‌ గృహకల్ప, ఏదులా పురం, ముత్తగూడెం, రెడ్డిపల్లి ప్రాంత విగ్రహాలను నాయుడుపేట వైపు ఏర్పాటు చేసిన మున్నేరు రాంప్‌ ద్వారా నిమజ్జనం చేయాలి.

●ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి తీర్థాల, మంగళగూడెం, మద్దివారిగూడెం, పోలిశెట్టిగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, కస్నాతండా, కాచిరాజుగూడెం, ఎం.వీ.పాలెం, ఆరెకోడు, ఆరెకోడు తండా, వాల్యా తండా, పిట్టలవారిగూడెం, పోలేపల్లి, గోల్లపాడు, పల్లెగూడెం గ్రామాల్లోని విగ్రహాలను తీర్థాల వద్ద మున్నేటి నిమజ్జనం చేయాలి.

●రూట్‌ నెంబర్‌ – 1 : మున్నేరు నుంచి పంపింగ్‌ వెల్‌ రోడ్డు, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, హర్కరా బావి సెంటర్‌, మూడు బొమ్మల సెంటర్‌ బోస్‌ బొమ్మ సెంటర్‌, చర్చి కంపౌండ్‌ మీదుగా వెళ్లాలి.

●రూట్‌ నెంబర్‌ – 2 : మున్నేరు నుంచి పంపింగ్‌ వెల్‌ రోడ్డు, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, హర్కరా బావి సెంటర్‌, మూడు బొమ్మల సెంటర్‌, బోస్‌ బొమ్మ సెంటర్‌, చర్చి కాంపౌండ్‌, జెడ్పీ, ఇల్లెందు క్రాస్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ లేదా మమత సర్కిల్‌ మీదుగా వెళ్లాలి.

●రూట్‌ నెంబర్‌ – 3 : ప్రకాష్‌నగర్‌ మున్నేరు నుంచి సెయింట్‌ జోసెఫ్‌ సెంటర్‌, చర్చి కాంపౌండ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేంత వరకు ప్రకాశనగర్‌ బ్రిడ్జి, కాల్వొడ్డు బ్రిడ్జి మీదుగా అన్నిరకాల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. ఇక రాపర్తినగర్‌ – కరుణగిరి బ్రిడ్జి మీదుగా సాధారణ వాహనాలనే అనుమతిస్తారు. అలాగే, మయూరి బ్రిడ్జి మీద నుంచి కూడా రాకపోకలు నిలిపేస్తారు. అంతేకాక నిమజ్జనం సమయాన రాపర్తి నగర్‌, కొత్త బస్టాండ్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, మమత సర్కిల్‌ వైపు వెళ్లే వాహనాలు, నెహ్రూ సర్కిల్‌ నుంచి ఎఫ్‌సీఐ గోదాంల మీదుగా వాహనాలకు అనుమతి ఉండదు. వాహనదారులు కాల్వొడ్డు, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, మిర్చి మార్కెట్‌, చర్చి కాంపౌండ్‌, చెరువుబజార్‌, జెడ్పీ, ఇల్లెందు క్రాస్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement