
సంత వేలం.. రూ.6.63 లక్షలు
కారేపల్లి: కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యాన ప్రతీ ఆదివారం కొనసాగే సంత నిర్వహణను అప్పగించేందుకు శుక్రవారం వేలం నిర్వహించారు. నార్కట్‌పల్లికి చెందిన వెంకటేశ్వర్లు, కారేపల్లికి రాము, పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేష్‌బాబు యాదవ్, రాములు పాల్గొనగా ఏడా ది కాలానికి అత్యధికంగా రూ.6.63లక్షలకు పాడిన మహేష్‌బాబు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.5.30లక్షలు పలకగా ఈసారి రూ.1.33లక్షలు అధికంగా నమోదైంది. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ నల్లమోతు శేషయ్య ఆధ్వర్యాన వేలం నిర్వహించగా సంతగుడి మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్‌తో పాటు వాసురెడ్డి సంపత్, మూడ్ మోహన్‌చౌహన్, జవ్వాజి రంగయ్య పాల్గొన్నారు.
కారేపల్లి సంతకు గత ఏడాది కంటే
రూ.1.33 లక్షలు అధికం