
●రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సుధాకర్
కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 51మంది ఉపాధ్యాయులను అవార్డులకు ఎంపిక చేయగా జాబితాలో జిల్లా నుంచి సుధాకర్‌కు మాత్రమే స్థానందక్కింది. చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం ఆయన స్వయంగా బడిబాట పేరిట బైక్‌యాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ బడిలో సౌకర్యాలను వివరిస్తూ తల్లిదండ్రులను ఒప్పించారు. ఇదే సమయాన బోధనలో నూతన పద్ధతులు పాటించడం, పాఠశాల అభివృద్ధిలో పౌర సమాజాన్ని భాగస్వాములుగా చేయడం, పాఠాలను నాటికల రూపంలోకి మార్చి విద్యార్థులతో ప్రదర్శించడాన్ని సుధాకర్ అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాక విద్యాభివృద్ధికి సోషల్‌మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ సమాజాన్ని జాగృతం చేస్తుండడంతో సుధాకర్‌ను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఎంఈఓ పత్తిపాటి నివేదిత, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అభినందించారు.
పాఠశాల స్థాయిలో జిల్లా నుంచి ఒక్కరే...