
ఎనిమిది ‘సోలార్’ గ్రామాల ఎంపిక
నేలకొండపల్లి/ముదిగొండ: జిల్లాలోని ఎనిమిది గ్రామాలను పూర్తిస్థాయి సోలార్ వెలుగులు అందించేందుకు ఎంపిక చేసినట్లు జిల్లా రెడ్‌కో మేనేజర్ పి.అజయ్‌కుమార్ తెలిపారు. నేలకొండపల్లి, ముదిగొండలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని తనికెళ్ల, కొణిజర్ల, తల్లాడ, అన్నారుగూడెం, వల్లభి, ముదిగొండ, నేలకొండపల్లి, కందుకూరు గ్రామాలను మోడల్ విలేజ్‌లుగా ఎంపిక చేయగా, ప్రజలకు సోలార్ ప్లాంట్లతో లాభాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటుచేసుకుంటే రూ.78 వేల సబ్సిడీ అందుతుందని చెప్పారు. ఎక్కువగా ప్లాంట్లు ఏర్పాటయ్యే గ్రామాలకు రూ.కోటి ప్రోత్సాహం జారీ చేస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మేనేజర్ సూచించారు. ఏఈలు కె.రామారావు, ఎం.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, సీహెచ్.రామకృష్ణ, సబ్ ఇంజనీర్ బి.రాంమోషన్, స్థానికులు పాల్గొన్నారు.