
జీవాల్లో వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలి
ఖమ్మంవ్యవసాయం: జీవాల్లో సీజనల్ వ్యా ధుల నివారణపై దృష్టి సారించాలని అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు కోరా రు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పశుసంవర్ధక, పశువైద్యాధికారి డాక్టర్ బి.పురంధర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మహాసభ గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్, జిల్లా అధ్యక్షుడు చిలకల వెంకటనర్సయ్య మాట్లాడుతూ జీవాలు నీలినాలుక, గొంతువాపు వ్యాధి, చిటుక వ్యాధి, ఊపిరితి త్తుల వ్యాధుల బారిన పడుతుండగా ప్రభుత్వపరంగా సరైన వైద్యం అందడం లేదని తెలి పారు. దీంతో ప్రైవేట్ మెడికల్ షాపుల యజ మానులు దోపిడీ చేస్తున్నందున అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిత్తూరి సింహాద్రి, చేతుల నాగేశ్వరరావు, మొరిమేకల కోటయ్య, తోడేటి లింగరాజు, వాకధాని కోటేశ్వరరావు, వలరాజు, ప్రభాకర్, రవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
7,8వ తేదీల్లో రోలర్ స్కేటింగ్ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ జట్ల ఎంపిక ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 7,8వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటరామకృష్ణ, ఐ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను ఈనెల 3వ తేదీలోపు కోచ్ కె.సురేష్(99123 99211)కు అందించాలని సూచించారు. ఇక్కడ ప్రతిభ చూపే క్రీడాకారులను రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.
హెమటాలజీ అనలైజర్ల కోసం టెండర్లు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు ఆటోమేటెడ్ హెమటాలజీ అనలైజర్లు సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్‌గౌడ్ తెలిపా రు. పెనుబల్లి, సత్తుపల్లి, మధిర, వైరా ఆస్పత్రులకు యంత్రాలు సరఫరా చేసేందుకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రూ.500 డీడీని ‘సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్, ఖమ్మం’ పేరిట చెల్లించి కలెక్టరేట్‌లోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో దరఖాస్తులు తీసుకోవచ్చని తెలిపారు.
ఏఎంఓగా శైలేంద్ర
ఖమ్మం సహకారనగర్: విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్(ఏఎంఓ)గా శైలేంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తొలు త ఆయన అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఏఎంఓగా బాధ్యతలు స్వీకరించిన శైలేంద్రకు డీఈఓ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్‌జీఎఫ్ కార్యదర్శిగా వెంకటేశ్వర్లు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా పునాటి వెంకటేశ్వర్లు నియమి తులయ్యారు. చింతకా ని జిల్లా పరిషత్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ను రెండేళ్ల కాలానికి ఈ పదవిలో నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు పీఈటీలు, పీడీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్యాస్ లీకేజీతో
మంటలు
బోనకల్: బోనకల్ మండలంలోని చొప్పకట్లపాలెంలో సోమవారం గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్ పేలడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన తన్నీరు వెంకట్రావమ్మ ఆదివారం రాత్రి వంట చేశాక గ్యాస్ బంద్ చేయడం మరిచిపోయింది. ఆమె సోమవారం ఉదయం వంట చేయడానికి లైటర్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉండడంతో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకట్రావమ్మను 108 సిబ్బంది బాను సహాన్, మిథున్ చక్రవర్తి ప్రథమ చికిత్స చేసి ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

జీవాల్లో వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలి