
బీసీ రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్‌దే..
ఖమ్మంమయూరిసెంటర్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు బీసీలను అణగదొక్కితే.. రిజర్వేషన్ల అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. అనంతరం వారు మాట్లాడు తూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పార్టీ శ్రేణులు ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కొండబాల కోటేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావుతో పాటు పార్టీ, అనుబంధ విభాగాల నాయకులు నాగండ్ల దీపక్‌చౌదరి, నూతి సత్యనారాయణ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కట్ల రంగారావు, యర్రం బాలగంగాధర్‌తిలక్, చోటా బాబా, వడ్డెబోయిన నరసింహారావు, హారికా నాయుడు, కమర్తపు మురళి, కన్నం వైష్ణవిప్రసన్నకృష్ణ, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, మొక్కా శేఖర్‌గౌడ్, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీ జిల్లా కార్యాలయంలో సంబురాలు