
●కొడుకులకు భారమైన తండ్రి
ఉన్న ఐదెకరాల భూమిని పంచుకున్న కొడుకులు తండ్రి బాధ్యతను పట్టించుకోకపోవడంతో ఆ వృద్ధుడు న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన వసంతం ఎల్లయ్యకు 94 ఏళ్లు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా, 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులైన ఇద్దరు కుమారులకు ఎల్లయ్య ఐదెకరాల భూమి సమానంగా పంచాడు. కానీ తండ్రిని చూసేందుకు వారు నిరాకరించడంతో ప్రస్తుతం పెద్దకుమార్తె వద్ద ఉంటున్నాడు. పెద్దలు పంచాయితీ నిర్వహించి నెలకు రూ.8వేలు, అరెకరం భూమి ఇవ్వాలన్నా కుమారులు నిరాకరించడంతో న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అధికారులను వేడుకున్నాడు.
●మాకు న్యాయం చేయండి..
బోనకల్ మండలం గోవిందాపురం(ఏ) గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు నిధుల దర్వినియోగంపై కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. నెల క్రితం నిధుల విషయమై ఐకేపీ ఎదుట నిరసన తెలపగా.. అప్పటి ఏపీఎం సురేంద్రబాబు సమస్యను గుర్తించారని చెప్పారు. కానీ ఆయన బదిలీ కావడంతో ఏపీఎం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గ్రామదీపిక కారణంగా సమస్యలు వస్తున్నందున చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని సభ్యులు షేక్ షాజహాన్, షాహీన్, రాధా, కృష్ణమ్మ, కృష్ణవేణి, త్రివేణి తదితరులు కోరారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్

●కొడుకులకు భారమైన తండ్రి