
కుప్పకూలిన షాప్ ముందు భాగం
నేలకొండపల్లి: వరుస వర్షాలతో నానడంతో శిథిలావస్థలో ఉన్న షాప్ ముందు భాగం కుప్పకూలింది. అయితే, ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నేలకొండపల్లికి శ్రీనివాసరావు అద్దె ఇంట్లో కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి గోడలు ఇటీవల వర్షాలకు నానడంతో సోమవారం ఉదయం షాప్ తీస్తుండగా ఇంటి ముందు భాగం కుప్పకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పగా, సదరు వ్యాపారి వెంటనే ఇల్లు ఖాళీ చేశారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై సోమవారం ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 15 మంది గాయపడ్డారు. వివరాలు ఇలా.. మణుగూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసు సుమారు 30 మంది ప్రయాణికులతో మణుగూరు నుంచి ఖమ్మం వస్తోంది. అదే సమయంలో లారీ వైరా వైపు నుంచి తల్లాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు వాహనాలు అతివేగంగా ఉండడంతో బస్సు డ్రైవర్ విజయ్ సహా బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఏసీపీ ఎం.ఏ.రెహమాన్, సీఐ ఎన్.సాగర్, ఎస్సై పి.రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు మూడు గంటల సమయం పట్టగా అంతసేపు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు

కుప్పకూలిన షాప్ ముందు భాగం