
రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: సంగారెడ్డిలో ఈనెల 27వ తేదీన జరగనున్న రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ కేటగిరీలో పి.పవిత్రాచారి, డి.హర్షిణి, టి.సాయి భవ్యశ్రీ ఎంపిక కాగా, టెక్నికల్ ఆఫీషియల్‌గా జిల్లా వాసి పి.సత్యజిత్‌చారి వ్యవహరించానున్నారు. వీరిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణచారి శనివారం అభినందించారు.
ఐదుగురికి ఏఎస్సైలుగా పదోన్నతి
ఖమ్మం క్రైం: ఖమ్మం కమిషనరేట్‌లోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురికి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ జాబితాలో సీహెచ్.నాగేశ్వరరావు, ఎస్.హర్జా, సీహెచ్.చంద్రశేఖర్, బి.కిష న్, ఖాజామొహినుద్దీన్ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని శనివారం సీపీ సునీల్‌దత్ అభినందించారు.

రాష్ట్రస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక