
వ్యాధుల కట్టడిపై దృష్టి సారించండి
ఖమ్మం వైద్యవిభాగం: దోమల ద్వారా వచ్చే వ్యాధుల కట్టడిపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్‌సింగ్ ఆదేశించారు. శనివారం ఖమ్మం వచ్చిన ఆయన డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, ఉద్యోగులతో సమీక్షించారు. వర్షాకాలంలో దోమల ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందనున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దోమలు, లార్వా నివారణకు ఫాగింగ్ చేయించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానంగా డెంగీ వ్యాప్తికి అవకాశాలు ఉన్నందున లక్షణాలు కనిపించిన వారికి పరీక్ష చేసి చికిత్స మొదలుపెట్టాలని తెలిపారు. ఈ వీసీలో డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, ప్రోగ్రాం అధికారులు వెంకట రమణ, చందునాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఏడీ అమర్ సింగ్