
18.60 అడుగులకు చేరిన పాలేరు
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం శనివారం సాయంత్రానికి 18.60 అడుగులకు చేరింది. సాగర్ నుండి 3,965 క్యూసెక్కుల నీటి సరఫరా కొనసాగుతుండగా మరో 100 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరుతోంది. ఇదే సమయాన రిజర్వాయర్ నుంచి దిగువకు 1,635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, ఔట్ ఫ్లో కన్నా ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల్లో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు చేరనుంది. కాగా, పాలేరు రిజర్వాయర్ సమీపాన ఎడమ కాల్వకు కొత్తగా యూటీ(అండర్ టన్నెల్) నిర్మాణం పూర్తికావడంతో ఎగువన ఉన్న పొలాల మీదుగా వచ్చే వరదను యూటీ ద్వారా సమీసంలోకి ఏటికి మళ్లించారు.