
కోమాలో నాలుగు నెలల బాలుడు
నేలకొండపల్లి: నిరుపేద కుటుంబానికి చెందిన నాలుగు నెలల బాలుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లాడు. వైద్యంకోసం ఆయన తల్లిదండ్రులు అందినకాడికల్లా అప్పులు తెచ్చినా ఫలితం లేక దాతలు చేయూతనివ్వాలని కోరుతున్నారు. మండలంలోని అప్పలనరసింహాపురానికి చెందినవ్యవసా య కూలీలు పార్తబోయిన వెంకటేశ్వర్లు – రాధిక దంపతులకు నాలుగు నెలల కిందట కమారుడు జన్మించాడు. ఆయనకు బుధవారం జ్వరం రావడంతో ఖమ్మంలో చికిత్సచేయిస్తుండగా ఫిట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే కోమాలోకి వెళ్లాడు. దీంతో ఇప్పటి వరకు రూ.లక్ష అప్పు తెచ్చిచికిత్స చేయించినా ఫలితం లేక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ తీసుకెళ్లినప్పటికీ కుమారుడి చికిత్స కోసం చేతిలో చిల్లిగవ్వ లేక వెంటేశ్వర్లు దంపతులు రోదిస్తున్నారు. దాతలు 81794 32013 నంబర్‌కు ఫోన్ పే / గు గూల్ పే ద్వారా నగదు పంపిస్తే తమ బిడ్డకు ప్రాణం పోసినట్లవుతుందని కోరుతున్నారు.
దాతలు చేయూతనివ్వాలని తల్లిదండ్రుల వినతి