
పీహెచ్‌సీలో ఎన్‌సీడీ పీఓ తనిఖీ
ముదిగొండ: ముదిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్‌సీడీ పోగ్రాం జిల్లా అధికారి రామారావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించిన ఆయన ల్యాబ్‌లో జరుగుతున్న పరీక్షలు, వ్యాక్సిన్ల నిల్వలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రజలు జీవన విధానం మార్చుకుని ప్రతీరోజు వ్యాయామం చేయడం, ఆహారం ఉప్పు తగ్గించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మండల వైద్యాధికారి అరుణాదేవి, ఉద్యోగులు సత్యవతి, నాగరాజకుమారి పాల్గొన్నారు.