ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరరావు

Jul 17 2025 3:38 AM | Updated on Jul 17 2025 3:38 AM

ఎన్‌ఏ

ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరర

ఖమ్మంగాంధీచౌక్‌: నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌ఏపీఈ) తెలంగాణ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పమ్మి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. భద్రాచలంలో ఇటీవల నిర్వహించిన అసోసియేషన్‌ ద్వైవార్షిక మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఖమ్మం ట్రంక్‌ రోడ్డు సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ వెంకటేశ్వరరావు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కొత్తగూడెంనకు చెందిన ఆర్‌.సంతోష్‌ సర్కిల్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని అసోసియేషన్‌ ఖమ్మం డివిజన్‌ ప్రతినిధులు సీహెచ్‌ కామేశ్వరరావు, బి.హుస్సేన్‌, బి.వీరన్న, సీహెచ్‌ఎస్‌వీబీ కుమార్‌, ఎ. రాంప్రసాద్‌ తదితరులు అభినందించారు.

ఆన్‌లైన్‌ రుణం పేరిట బురిడీ

నేలకొండపల్లి: తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామనే ప్రకటన నమ్మిన ఓ యువకుడు మోసపోయాడు. నేలకొండపల్లికి చెందిన ఓ యువకుడికి యాప్‌ ద్వారా రూ.2 లక్షల రుణం వస్తుందని మెసేజ్‌ వచ్చింది. తొలుత చార్జీల కింద రూ.4,500 చెల్లించాలని చెప్పడంతో అవి చెల్లించాడు. ఆ తర్వాత రుణం మంజూరైందంటూ రూ.9,500 జీఎస్టీ చెల్లించాలని చెప్పడంతో యువకుడు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. దీంతో యువకుడు మోసపోయినట్లు గ్రహించి తెలిసిన వారికి చెప్పుకుని వాపోయాడు.

పాలేరు వాసికి డాక్టరేట్‌

కూసుమంచి: మండలంలోని పాలేరుకు చెందిన అనంతుల మహేశ్‌గౌడ్‌ కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ లభించింది. బయ్యారం ప్రాంతంలోని ఇనుప ధాతువుపై ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి ఆయనకు డాక్టరేట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్‌ను గ్రామస్తులు అభినందించారు.

మొబైల్‌ యూనిట్‌ను

పరిశీలించిన డీఎంహెచ్‌ఓ

సత్తుపల్లి: మండలంలోని చంద్రాయపాలెంలో ఐటీడీఏ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన కంటైనర్‌ మొ బైల్‌ మెడికల్‌ యూనిట్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కళావతిబాయి బుధవారం పరిశీలించారు. ఈ క్యాంప్‌ ద్వారా అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసిన ఆమె సిబ్బందికి సూచనలు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ టి.సీతారాం, మెడికల్‌ ఆఫీసర్‌ ఆర్‌.అవినాష్‌, సూపర్‌వైజర్లు శారారాణి, వెంకటేశ్వ రరావు పాల్గొన్నారు.

పీహెచ్‌సీల్లో నూరు శాతం వైద్యసేవలు

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని పీహెచ్‌సీల్లో నూరుశాతం వైద్యసేవలు అందించాలనిడీఎంహె చ్‌ఓ కళావతిబాయి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బు ధవారం ఆమె ఖమ్మం డివిజన్‌లోని పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కొన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఇమ్యూనైజేషన్‌, ప్రసవాల్లో వెనకబడినందున తీరు మా ర్చుకోవాలని సూచించారు. ఈ విషయమై మెడికల్‌ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్‌, ప్రో గ్రాం ఆఫీసర్‌ రామారావు, డెమో సుబ్రహ్మణ్యం, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ నవీన్‌, ఎన్‌హెచ్‌ఎం డీపీఓ దుర్గ, నాగరాజు, రవితేజ, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరర1
1/2

ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరర

ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరర2
2/2

ఎన్‌ఏపీఈ సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వరర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement