
అందని ద్రాక్షగా ఫీజు రీయింబర్స్‌మెంట్
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకార వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయడమే కాక విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యాన బుధవారం చలో కలెక్టరేట్ నిర్వహించా రు. విద్యార్థులు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గేటు బయట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నాలుగేళ్లగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వకపోగా, ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమయే ప్రమాదముందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు నాగుల్‌మీరా, మధు, శివనాయక్, వంశీ, మనోజ్, సురేశ్, పవన్, వెంకటేశ్, లక్ష్మణ్, నాగేంద్రబాబు, గోపి, నరేందర్, పావని, మల్లికా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యాన చలో కలెక్టరేట్.. అడ్డుకున్న పోలీసులు

అందని ద్రాక్షగా ఫీజు రీయింబర్స్‌మెంట్