
ఫొటోగ్రాఫర్లకు అండగా ‘కుటుంబ భరోసా’
కారేపల్లి: సాంకేతికను అందిపుచ్చుకుంటేనే ఫొటోగ్రాఫర్లు వృత్తిలో రాణిస్తారని ఫొటో, వీడియోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే హుస్సేన్ తెలిపారు. కారేపల్లి మండల అసోసియేష న్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవా రం జరగగా ఆయన పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లంకి పిచ్చయ్య, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి సైదిరెడ్డిని సన్మానించాక హుస్సేన్ మా ట్లాడుతూ.. ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం కుటుంబ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రూ.10 చెల్లిస్తే రూ.1.70 లక్షలు, రూ.100 చెల్లిస్తే రూ.2.50 లక్షలు బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 138 మంది కుటుంబాలకు రూ.3 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చావా సంపత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు మరగాని వెంకట్‌తో పాటు నీరుడి తిరుపతిరావు, మరగాని వెంకట్, నాగరాజు దేవర, వేముల నర్సింహారావు, కనికొండ అశోక్, తిరుమల్‌రావు, కనకారావు, బాబా, కమతం రఘు, ఎస్.ఆదినారాయణ, లక్ష్మణ్, రియాజ్, సీహెచ్.రాధాకృష్ణ, కుమ్మరి పాపారావు, కన్ని, అన్వర్, కొండ జ్యోతిబాబు, మేదరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.