
స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనూ కలిసే పోటీ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐతో తనకు 30 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాను ఏ స్థాయిలో ఉన్నా ఆ అనుబంధం కొనసాగిస్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ తెలిపా రు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సీపీఐ, కాంగ్రెస్ వైరా నియోజకవర్గ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన తనకు సీపీఐ నేతలు అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైరా నియోజకవర్గంలో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సీపీఐకి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. అనేక రాజకీయ అంశాల్లో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్ మౌలానా, ఎర్రా బాబు, వడ్డే నారాయణరావు, సూరంపల్లి రామా రావు, అజ్మీర రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, జాగర్లమూడి రంజిత్‌కుమార్, దొండపాటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ నేతలతో వైరా ఎమ్మెల్యే రాందాస్