
మున్నేటిపై చెక్‌డ్యామ్‌ల తొలగింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరాన్ని మున్నేటి వరద ముప్పు నుంచి రక్షించేలా రెండు చెక్‌డ్యామ్‌లను తొలగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మున్నేటిపై ప్రకాశ్‌నగర్, రంగనాయకుల గుట్ట వద్ద చెక్‌డ్యామ్‌లు ఉండగా, వరద పోటెత్తినప్పుడు నీరు నిలిచి సమీప ప్రాంతాలను ముంచెత్తుతోందని అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యాన ప్రజల ప్రాణాలు, ఆస్తులతో పాటు నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేలా చెక్‌డ్యామ్‌లను తొలగించాలని కలెక్టర్ మంగళవారం ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రతా చర్యలు పాటిస్తూ వీటిని తొలగించాలని పేర్కొన్నారు. కలెక్టర్ సూచనలతో రంగనాయకుల గుట్ట వద్ద చెక్ డ్యామ్‌ను పూర్తిగా తొలగించనుండగా, ప్రకాష్‌నగర్ చెక్ డ్యామ్‌ను ఒక మీటర్ మేర తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రజల భద్రత, వరద నివారణ కోసం నిర్ణయం