
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.