
దళారులకు నయాపైసా ఇవ్వొద్దు..
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● ఎమ్మెల్యే రాగమయితో కలిసి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ
సత్తుపల్లిటౌన్/వేంసూరు: ఇళ్లు మంజూరు చేయిస్తాని ఎవరైనా నమ్మబలికినా నయాపైసా ఇవ్వొద్దని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసేవన్నీ తప్పుడు విమర్శలేనని.. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని ఆయన తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపాలిటీ, మండలానికి సంబంధించి 574 మందికి, వేంసూరులో జరిగిన కార్యక్రమంలో 570మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుండడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో రైతుబంధు తప్ప ఏ పథకాన్ని సక్రమంగా అమలుచేయలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, సన్న ధాన్యం రైతులకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడే పేదలకు ఇళ్లు మంజూరవుతున్నాయని చెప్పారు. ప్రతీ పథకంలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నందున, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, ఆర్‌డీఓ రాజేంద్రగౌడ్, హౌసింగ్ డీఈఈ విక్రమం, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజ, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నర్సింహారావు, ఎం.డీ.కమల్‌పాషా, మందపాటి ముత్తారెడ్డి, తోట సుజలరాణి, ఉడతనేని అప్పారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, చల్లారి వెంకటేశ్వరరావు, నారాయణవరపు శ్రీనివాస్, కాసరి చంద్రశేఖర్‌రెడ్డి, పుచ్చకాయల సోమిరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి రాఘవరెడ్డి, ఎం.డీ.పైజుద్దీన్, ఎం.డీ.ఫకృద్దీన్, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికీ ఇళ్లే లక్ష్యం
పెనుబల్లి : పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. పెనుబల్లిలో మండల పరిధిలోని 599 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశాక ఆమె మాట్లాడారు. ఐదేళ్లలో సత్తుపల్లి నియోజకవర్గంలో 20 – 25 వేల ఇళ్ల మంజూరుకు ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నామని తెలిపారు. కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్, ఎంపీడీఓ అన్నపూర్ణ, కల్లూరు, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్లు భాగం నీరజాచౌదరి, దోమ ఆనందబాబుతో పాటు మట్టా దయానంద్, రాజబోయిన కోటేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, కీసర శ్రీనివాసరెడ్డి, బుక్కా కృష్ణవేణి, గోదా రాములు, మేకతొట్టి కాంతయ్య, మాలోతు రాధాకృష్ణ పాల్గొన్నారు.