
జిల్లా వ్యాప్తంగా వర్షం
● సగటు వర్షపాతం 24 మి.మీ. ● పలుచోట్ల 45 మి.మీ.కుపైగానే.. ● మూడు రోజుల పాటు వర్ష సూచన
మండలం వర్షపాతం
వైరా 47.4
చింతకాని 46.6
పెనుబల్లి 45.2
నేలకొండపల్లి 43.6
సత్తుపల్లి 42.0
తల్లాడ 33.4
కూసుమంచి 33.8
మధిర 32.8
కామేపల్లి 26.6
సింగరేణి 19.4
ఖమ్మం అర్బన్ 19.2
ఖమ్మం రూరల్ 16.2
ఎర్రుపాలెం 15.6
కొణిజర్ల 12.6
వేంసూరు 10.6
ముదిగొండ,
బోనకల్ 10.4
తిరుమలాయపాలెం 10.2
రఘునాథపాలెం,
ఏన్కూరు 9.8
కల్లూరు 8.4
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. మొత్తంగా 504.0 మి.మీ. వర్షపాతనం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 24 మి.మీ. కాగా అత్యధికంగా వైరాలో 47.4 మి.మీ. చింతకాని, పెనుబల్లి, నేలకొండపల్లి, సత్తుపల్లి మండలాల్లో 40 మి.మీ.కు పైగా నమోదైంది. కల్లూరులో అత్యల్పంగా 8.4 మి.మీ. వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం 33.4 నుంచి 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పమ్మిలో 38.2 డిగ్రీలు, అత్యల్పంగా గౌరారంలో 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రైతులు పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ వానలు మరో మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.