
ముక్తిని కలిగించేది పుణ్య స్నానం
సరస్వతీ పుష్కరాలకు కుటుంబమంతా వెళ్లొచ్చాం. త్రివేణీ సంగమంలో స్నానమాచరించి సరస్వతీ అమ్మవారిని, ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అయితే సౌకర్యాలు ఆశించినంతా లేవు. తినుబండారాల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
– వల్లాల స్వప్న, రిక్కాబజార్, ఖమ్మం
సమూహంగా వెళ్లేందుకు ఏర్పాట్లు
కాలనీ వాసులం, కుటుంబ సభ్యులం కలిసి పుష్కరాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. నేరుగా బస్సులు లేకపోవడంతో ట్రావెల్స్ వాహనం మాట్లాడుకున్నాం. ట్రావెల్స్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి.
– కొండపల్లి మనోహరి, శ్రీనివాసనగర్, ఖమ్మం
వాహనాలకు డిమాండ్ పెరిగింది
పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లేందుకు వాహనాల బుకింగ్‌లు పెరిగాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరో వైపు వేసవి సెలవుల సమయంలో పుష్కరాలు రావడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. దూరం, వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నాం.
– ఆర్ ప్రకాష్, ట్రావెల్స్ యజమాని, ఖమ్మం
●

ముక్తిని కలిగించేది పుణ్య స్నానం

ముక్తిని కలిగించేది పుణ్య స్నానం