ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

May 23 2025 2:17 AM | Updated on May 23 2025 2:17 AM

ప్రత్

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

నేలకొండపల్లి: ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మారగాని లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన అసోసియేషన్‌ జిల్లా కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోగా ఆయన నియమితులయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కె.శ్రావణినాయుడు, కోశాధికారిగా వై.సూరయ్య, ఉపాధ్యక్షుడిగా వి.వీరన్న, సంయుక్త కార్యదర్శిగా పి.నరేష్‌, గౌరవ సలహాదారులుగా నరేష్‌, కృష్ణయ్య, మహేష్‌, చంద్రావతి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎం.శివకుమార్‌, రవికుమార్‌ ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రత్యేక ఉపాధ్యాయలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు, హక్కుల సాధన కోసం కృషి చేస్తామన్నారు.

బస్తీ దవాఖానా

ఆకస్మిక తనిఖీ

ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని రంగనాయకుల గుట్ట బస్తీ దవాఖానాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.కళావతిబాయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, వైద్యులు పేషంట్లతో వ్యవహారిస్తున్న తీరు, అటెండెన్స్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నాక సమయపాలన విధిగా పాటించాలన్నారు. అలాగే పేషంట్‌లతో మర్యాదగా వ్యవహారించాలని, లాబ్‌ పరీక్షలు నిర్వహించాలని, మందులు సరిపడా అందించాలని, అసంక్రమిత వ్యాధులపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. మలేరియ, డెంగీ, కేన్సర్‌, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, టీబీ వ్యాధిగ్రస్తులకు మంచి సేవలతో పాటు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆరోగ్యవిద్యను అందించాలని సూచించారు.

విద్యుత్‌ అభివృద్ధి పనుల పరిశీలన

ఖమ్మంవ్యవసాయం: దానవాయిగూడెం సబ్‌ స్టేషన్‌ పరిధిలో, రైల్వే అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ పనులను గురువారం ఖమ్మం ఎన్పీడీసీఎల్‌ సర్కిల్‌ అధికారుల బృందం పరిశీలించింది. మేకల భిక్షమయ్య ఫంక్షన్‌ హాల్‌ నుంచి కామంచికల్‌ వరకు జరుగుతున్న రహదార్ల అభివృద్ధి పనులకు సంబంధించి విద్యుత్‌ లైన్‌ షిఫ్టింగ్‌ పనులతో పాటు కామంచికల్‌లో నూతన సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం టౌన్‌ డీఈ నంబూరి రామారావు, రఘునాథపాలెం ఏడీఈ సంజీవ్‌ పాల్గొన్నారు.

అడిషనల్‌ డీసీపీ బదిలీ

ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) ఎ.నరేష్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఆయనను జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా ఏఎస్పీ(అడ్మిన్‌)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాదిన్నర క్రితం ఖమ్మం అడిషనల్‌ డీసీపీగా బదిలీపై రాగా.. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కాగా, మున్నేరు వరదల సమయాన ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందారు.

రామయ్య సేవలో

మాజీ స్పీకర్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాజీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ నేత మధుసూదనాచారి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ నేత ఎనుగుల రాకేష్‌ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు మానె రామకృష్ణ, మండల కన్వీనర్‌ సునీల్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల  సంఘం కమిటీ ఎన్నిక
1
1/5

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల  సంఘం కమిటీ ఎన్నిక
2
2/5

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల  సంఘం కమిటీ ఎన్నిక
3
3/5

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల  సంఘం కమిటీ ఎన్నిక
4
4/5

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల  సంఘం కమిటీ ఎన్నిక
5
5/5

ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement