
బావమరిదిని దించేందుకు వెళ్లి అనంతలోకాలకు..
తల్లాడ: తల్లాడ ఎన్టీఆర్‌నగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు(28) అతడి కుమారుడు క్రిశాంత్(6) మోటార్ సైకిల్‌పై తల్లాడ వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్‌నగర్ వద్ద జాతీయ రహదారిలో ఎదురుగా సత్తుపల్లి నుంచి తల్లాడ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రిశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా రాంబాబును 108లో ఖమ్మం ప్రభుత్వ్రాస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
బావమరిదిని బస్టాండ్‌లో దించేందుకు వెళ్లి..
కొత్తపల్లి రాంబాబు తన భార్య గోపరాణి పిల్లలతో పాటు అత్తగారు ఊరైన రామచంద్రాపురం గ్రామానికి బుధవారం రాత్రి వచ్చారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం మధ్యాహ్నం తన బావమరిది తిరుపతిరావును తల్లాడ బస్టాండ్‌లో దించేందుకు మోటార్ సైకిల్‌పై వచ్చారు. బావమరిదిని దించేందుకు వస్తుండగా తన కుమారుడు క్రిశాంత్ నేను కూడా వస్తానని అనడంతో కుమారుడితో పాటు బావమరిదిని తీసుకొని బస్టాండ్‌లో దించి తిరిగి రామచంద్రాపురం బయలు దేరాడు. ఈక్రమంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా తండ్రీకుమారుడు మృతి చెందగా.. గ్రామంలో విషాదం అలుముకుంది.
డీసీఎం వ్యాన్ ఢీకొని తండ్రీకొడుకులు మృతి

బావమరిదిని దించేందుకు వెళ్లి అనంతలోకాలకు..