
సంస్కరణలకు ఆద్యుడు.. రాజీవ్‌గాంధీ
ఖమ్మంవన్‌టౌన్: దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలకు నాంది పలికారని, భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజనీకుమార్, కుమార్, కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, సంతోష్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, రాపర్తి శరత్, మడూరి ప్రసాద్, కన్నం వైష్ణవి, ప్రసన్నక్రిష్ణ, రమేష్, నాగరాజు, నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.