
ఈనెల 31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కులాల్లో అర్హత కలిగిన విద్యార్థులు ఉపకార వేతనాల(ఫ్రెష్, రెన్యువల్) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ సూచించారు. బ్యాంక్ అకౌంట్‌ను బ్రాంచ్‌లో ఆధార్ సీడింగ్ చేసుకున్నాక ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజి ప్రిన్సిపాళ్లు డిజిటల్ కీతో పాటు ఈ–పాస్ లాగిన్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఆతర్వాత విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులను ధ్రువీకరించి ఈ–పాస్ లాగిన్‌లోనే జిల్లా అధికారికి ఫార్వర్డ్ చేయాలని సూచించారు.
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు
ఖమ్మంక్రైం: ఇంటర్‌మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి 29వ తేదీ వరకు జరగనుండగా, పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 38కేంద్రాల వద్ద ఉదయం 8నుంచి సాయంత్రం 6–30 గంటల వరకు సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ఈనేపథ్యాన కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులకు అనుమతి ఉండదని తెలిపారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సీపీ సూచించారు.
ప్రభుత్వ బడుల్లో
ప్రవేశాలు పెంచాలి
ఖమ్మంరూరల్: త్వరలో మొదలుకానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ ఎస్.సత్యనారాయణ సూచించారు. రూరల్ మండలం ఏదులాపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన శిక్షణను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల చేరిక శాతాన్ని నిలకడగా కొనసాగేలా ఉపాధ్యాయులు ఇప్పటినుంచే ప్రవేశాలపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం పెరిగేలా బోధనలో మార్పులను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎంఈఓ శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్లు పాల్గొన్నారు.
పోలీసు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
ఖమ్మంక్రైం: గత ఏడాది డిసెంబర్‌లో నేలకొండపల్లి మండలంలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించడంలో కీలంగా వ్యవహరించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా కూసుమంచి సీఐ టి.సంజీవ్, నేలకొండపల్లి కానిస్టేబుల్ ఎం.నాగరాజును డీజీపీ జితేందర్ అభినందించారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన కార్యాలయంలో వారికి డీజీపీ ప్రశంసాపత్రాలు అందించగా, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ వారిని అభినందించారు.
లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో డిఫెన్స్ కౌన్సిల్ ఉద్యోగాలకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు అర్హులైన న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఒక ప్రకటనలో సూచించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా స్పీడ్ పోస్ట్ లేదా వ్యక్తిగతంగానైనా న్యాయ సేవాధికార సంస్థలో తమ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

ఈనెల 31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఈనెల 31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు