వరద బాధితులకు అండగా నిలుద్దాం
కూసుమంచి: వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అందరూ అండగా నిలవాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్షా రైనా పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం నగదు, దుస్తులు ఇతర వస్తువులను అందించేందుకు ‘నా ఖమ్మం కోసం నేను’పేరిట గణేశ్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ప్రజలు విరాళాలు వేయాలని సూచించా రు. కూసుమంచిలోని అయ్యగారి సెంటర్‌లో వినాయక విగ్రహం వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన బాక్స్‌లో ఆదివారం సీఈఓతో పాటు డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి నగదు విరాళంగా వేశారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ.. ప్రజలు తమకు తోచినంత సాయాన్ని వరద బాధితులకు అందించి చేయూతనివ్వాలని కోరారు. తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీఓ రాంచందర్, గ్రామ కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు పరిశీలన
ఖమ్మంవన్‌టౌన్: జిల్లా పరిషత్ సీఈఓ దీక్షా రైనా వరద ముంపు ప్రాంతమైన జలగంనగర్‌లో ఆదివారం పర్యటించారు. జలగంనగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆమె త్వరగా పూర్తిచేసి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే, రామ్‌లీలా ఫంక్షన్ హాల్‌లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు వసతులు, భోజనంపై ఆరా తీశారు.


